అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KCR Farmhouse | ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌పై వ్యాఖ్యలను నిరసిస్తూ.. కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలి వస్తున్నారు. దీంతో పోలీసులు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసుల మోహరించారు.
KCR Farmhouse | బీఆర్ఎస్ నేతల అరెస్ట్
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ (KCR) వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించడానికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్ నాయకులు సైతం భారీగా ఎర్రవల్లికి బయలుదేరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎర్రవల్లికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి గజ్వేల్ తరలించారు. డీఐజీ, సీపీ దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: PCB Chairman | పీసీబీ ఛైర్మన్‌గా రాజ శేఖర్ రెడ్డి నియామకం