అక్షరటుడే, ఆలూర్: Dalit Speaker Remarks | దళిత స్పీకర్ను దూషించిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆలూర్ మండల (Alur Mandal) కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు.
Dalit Speaker Remarks | అసెంబ్లీ సాక్షిగా..
ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించే అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ను పరుష పదజాలంతో దూషించడం అత్యంత సిగ్గుచేటని ప్రమోద్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశామన్నారు. స్పీకర్ను అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లారెడ్డి, బార్ల ముత్యం, తలారి రాకేష్, సమీర్, శేషి, యాదాగౌడ్, ప్రభాకర్, ప్రశాంత్, శ్రీనివాస్ గౌడ్, నవనీత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కళాశాలల పోరుబాట