BRS Leaders Attack | కాంగ్రెస్​ నాయకులపై బీఆర్​ఎస్​ శ్రేణుల దాడి

కేసీఆర్​ ఫామ్​హౌస్​ ముట్టడికి వస్తున్న కాంగ్రెస్​ నాయకులపై సిద్దిపేట జిల్లా దామరకుంట వద్ద బీఆర్​ఎస్​ కార్యకర్తలు దాడి చేశారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS Leaders Attack | రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతుండగా.. మరోవైపు కేసీఆర్​ ఫామ్​హౌస్​ ముట్టడికి కాంగ్రెస్​ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ ఆధ్వర్యంలో కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రం ముట్టడికి నాయకులు, కార్యకర్తలు భారీగా వస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్​కు రక్షణగా ఉండేందుకు బీఆర్​ఎస్​ నాయకులు సైతం వస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ (BRS) నాయకులను అడ్డుకుంటున్నారు. ఎర్రవల్లికి రాకుండా అరెస్ట్​ చేస్తున్నారు. ఎర్రవల్లికి వస్తున్న కాంగ్రెస్​ నాయకులపై సిద్దిపేట జిల్లా దామరకుంట వద్ద బీఆర్​ఎస్​ కార్యకర్తలు దాడి చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

BRS Leaders Attack | ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్​, హరీశ్​రావు

కాంగ్రెస్​ ముట్టడి పిలుపు నేపథ్యంలో అసెంబ్లీ నుంచి కేటీఆర్​, హరీశ్​రావు నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలు దేరారు. కేసీఆర్ మీద కాంగ్రెస్​ నాయకులు దాడి చేయడానికి వస్తున్నారని ఎమ్మెల్యేలతో పాటు తరలి వెళ్లారు. ఎంత మందిని పోలీసులని పంపుతారో పంపండి.. ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో రండి తేల్చుకుంటాం అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అన్నారు.

ఇది కూడా చదవండి..: MLA Prashanth Reddy | కేసీఆర్​పై దాడి చేసేందుకు కాంగ్రెస్​ ప్లాన్​: మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *