అక్షరటుడే, వెబ్‌డెస్క్: DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17 మందికి స్థాన చలనం కలిగించారు.
వెయిటింగ్లో ఉన్న కె. బాలకృష్ణారెడ్డిని మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ (Cyber Crime) ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న ఎస్జీ శివశంకర్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్లో ఉన్న ఎస్కే అబ్దుల్ రెహ్మాన్‌ను భూపాలపల్లి డీసీఆర్బీ డీఎస్పీగా పంపించారు. ఏ రవికుమార్‌ను జగిత్యాల డీసీఆర్బీకి, నందిరామ్నాయక్ను హైదరాబాద్ సిటీ డీజీ కంట్రోల్ రూమ్‌కు బదిలీ చేశారు.
DSP Transfers | టీజీపీఏకు..
వెయిటింగ్లో ఉన్న సోమ్‌నారాయణ సింగ్‌ను తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA)కి, జే వెంకటేశ్వర్రావును మెదక్‌కు, బి కృష్ణకుమార్‌ను సెక్రెటెరీయట్ సెక్యూరిటీ ఏసీపీగా నియమించారు. ఎల్ రమేశ్‌కుమార్‌ను సీటీసీ ఏసీపీగా, ఎన్ శ్రీనివాసరెడ్డి సంగారెడ్డి డీఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. కడారు వెంకట్‌రెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీకి, కోమట్ల సుబ్బరామిరెడ్డి సీసీఎస్ ఏసీపీగా, ఎస్ సుదర్శన్ సీసీఎస్‌కు, ఎన్ శంకర్ సెక్రెటెరీయట్కు బదిలీ అయ్యారు. పి విజయ్ కుమార్ వెస్ట్ జోన్ రోడ్ సేఫ్టీగా డీఎస్పీగా, కె భాస్కర్ టీజీపీఏకు, ఎం వెంకట నర్సయ్య సీఐడీ డీఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
దీనిని కూడా చదవండి : ACB Caught DEE | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డీఈఈ
Collectors mathram marcharu long standing deeni annthryam yemito
Helo srinivas garu, మీరు సమాజం లో జరుగుతున్న అక్రమాలను వెలుగు లో తేగలరా….?