Rakesh Mehta Death | ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ రాకేష్ మెహతా ఆత్మహత్య

ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా (74) బలవన్మరణానికి పాల్పడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే దెబ్‌డెస్క్: Rakesh Mehta Death | ఢిల్లీ ( Delhi )మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా (74) బలవన్మరణానికి పాల్పడ్డారు. నోయిడాలోని సెక్టార్ 82లో ఉన్న కేంద్రీయ విహార్-2 సొసైటీలోని స్వగృహంలో ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. సెప్టెంబరు 6న జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Rakesh Mehta Death | ఫోన్ స్పందించకపోవడంతో ..

ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య సుమంతి మెహతా డెహ్రాడూన్‌లోని తమ కుమారుడి వద్ద ఉన్నారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫేజ్-2 పోలీసులు.. లోపలి నుంచి గడియ వేసి ఉన్న తలుపులను బద్దలుకొట్టి చూడగా ఆయన మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ప్రకారం.. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, సోమవారం లోధి రోడ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు ఈ ఘటనపై ఫోరెన్సిక్ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Rakesh Mehta Death | కీలక సేవలు..

1975 బ్యాచ్‌కు చెందిన రాకేష్ మెహతా.. దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో 2007 నుంచి 2010 నవంబర్‌లో పదవీ విరమణ చేసే వరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (చీఫ్ సెక్రటరీ) బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీకాలంలోనే ప్రతిష్టాత్మకమైన 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ జరిగింది. ఢిల్లీ నగర ఆధునీకరణలో భాగంగా రవాణా, విద్యుత్ , పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కమిషనర్‌గా కూడా ఆయన విశేష సేవలందించి మంచి పేరు సంపాదించారు.

ఇది కడూా చదవండి:  Karamtara Engineering IPO | ఐపీవోకు ఇంజినీరింగ్ కంపెనీ.. ఊరిస్తున్న జీఎంపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *