Telangana Liberation Day | సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Telangana Liberation Day | సెప్టెంబర్​ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) డిమాండ్​ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​ భుజంగరావుకు వినతిపత్రం అందజేశారు.

Telangana Liberation Day | త్యాగాలు చేసిన రోజు..

దినేష్​ కులాచారి మాట్లాడుతూ.. 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. దీంట్లో భాగంగా జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ కార్యక్రమాలు జరగాలన్నారు. హైదరాబాద్​ విమోచనంలో కీలకపాత్ర పోషించిన సర్దార్​ వల్లభాయ్​ పటేల్​కు(Sardar Vallabhbhai Patel) హైదరాబాద్​లో (Hyderabad) భారీ స్టాచ్యూ  ఏర్పాటు చేయాలన్నారు.

నిజాం పాలన, రజాకార్ల దురాగతాలు, ప్రజాపోరాటాలు, ఆపరేషన్​ పోలో, హైదరాబాద్​ సంస్థానం భారతదేశంలో విలీనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను పరిరక్షించాలని కోరారు. ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన స్మృతికేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి,  నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *