Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Crude Oil Prices | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీ అరేబియాలోని పలు నగరాలపై, ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా  (America) స్థావరంపై దాడులు చేయడం ప్రతిగా అమెరికా దళాలు పలు ఇరాన్ చమురు ట్యాంకర్లను టార్గెట్ చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి.

Crude Oil Prices | ద్రవోల్బణ భయాలతో..

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అంతటా మంటలు రేపుతోంది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణ భయాలతో గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ మÖడో సెషన్‌లోనూ భారీగా పడిపోయాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

Crude Oil Prices | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 162 361పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 04 పాయింట్లు పెరిగింది. అక్కడి నుంచి 487 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 27 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 140 పాయిట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 813 పాయింట్ల నష్టంతో 74,764 వద్ద, నిఫ్టీ 203 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద స్థిరపడ్డాయి.

Crude Oil Prices | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,877 కంపెనీలు లాభపడగా 2,498 స్టాక్స్ నష్టపోయాయి. 213 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 189 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 129 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్ లాభపడగా.. 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీపోర్ట్స్ 3.67 శాతం, టాటా స్టీల్ 2.42 శాతం, ట్రెంట్ 1.12 శాతం, ఎన్టీపీసీ 0.53 శాతం, ఆసియన్ పెయింట్ 0.08 శాతం లాభపడ్డాయి.

Top losers : హెచ్సీఎల్ టెక్ 4.55 శాతం, ఇన్ఫోసిస్ 4.43 శాతం, టెక్ మహీంద్రా 3.87 శాతం, టీసీఎస్ 2.26 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.23 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices | తగ్గని క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *