Army Arms Theft | ఆయుధాల చోరీ కేసు.. ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్​

ఆర్మీ రెజిమెంట్​లో ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు సీనియర్​ ఆర్మీ అధికారులను అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Army Arms Theft | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని బొల్లారంలో గల మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ స్థావరం నుంచి ఆయుధాలు చోరీ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ఆర్మీ అధికారులను అరెస్ట్ చేశారు.

సికింద్రాబాద్​ పరిధిలోని బొల్లారం ఆర్మీ రెజిమెంట్​లో చోరీ జరిగిన విషయం గత నెల 30న వెలుగులోకి వచ్చింది. ఏకే –47 సహా పలు ఆయుధాలు చోరీ అయ్యాయి. దీనిపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ భద్రత ఉండే ప్రాంతంలో ఆయుధాలు చోరీ కావడంతో ఇందులో సిబ్బంది పాత్ర ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. ఆర్మీ అధికారులు ప్రత్యేక బృందాలను పంపించారు. స్థానికంగా విధులు నిర్వహించే పలువురిని విచారించిన అనంతరం ముగ్గురు సీనియర్​ అధికారులు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

Army Arms Theft | సీసీ కెమెరాలు ఆఫ్​ చేసి..

నిందితులు ఈ చోరీ ఒక్క రోజే చేయలేదు. మూడు నెలలుగా పక్కా ప్రణాళికతో ఆయుధాలను మాయం చేశారు. రాత్రి సమయంలో విధుల్లో ఉండే సిబ్బందిని ఇతర పనులపై పంపి.. సీసీ కెమెరాలు ఆఫ్​ చేసి ఆయుధాలను చోరీ చేశారు. అనంతరం గత నెల 30న తాళం పగులగొట్టి చోరీ జరిగినట్లు సీన్​ క్రియేట్​ చేశారు. దీంతో పరిశీలించిన అధికారులు నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక (ఇన్సాస్) రైఫిల్, మందుగుండు సామగ్రి ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అయితే అధికారుల విచారణలో నిందితులు దొరికారు. వారిని అదుపులోకి తీసుకొని ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి తరలించారు.

Army Arms Theft | ఎవరి కోసం..

ఈ ఆయుధాలను ఎందు కోసం చోరీ చేశారనే దానిపై ఆర్మీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాద కుట్ర దాగి ఉందా, నేరుగా అధికారులే ఈ పని చేశారా లేక అగ్నివీర్లను బెదిరించి చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న చేస్తున్నారు. దొరికిన ఆర్మీ అధికారుల కాల్‌ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Ganesh Immersion | గణేశ్ నిమజ్జనానికి హైడ్రా చర్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *