Transgender Representation | మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు.. అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్

పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు సముచిత సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ వేదిక కల్పించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Transgender Representation | పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు సముచిత సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ వేదిక కల్పించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు  ( Sridhar Babu )ఇవాళ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించుకునేలా ఈ చట్టంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. సమాజంలో వెనుకబడిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పాలనాపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Transgender Representation | కీలక భాగస్వామ్యం..

స్థానిక సంస్థల సమావేశాల్లో కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు భాగస్వాములు కావడం ద్వారా వారి సమస్యలను నేరుగా ప్రభుత్వ , అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. సమాజంలో ఏ వర్గం కూడా వెనుకబడి ఉండకూడదనే సమున్నత ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మున్సిపల్ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి పాటుపడుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మరోసారి ముందు వరుసలో నిలిచింది. ఈ బిల్లు ఆమోదం ద్వారా మున్సిపల్ పాలనలో సరికొత్త సంస్కరణలకు బాటలు పడినట్లయింది. సభలో ఈ బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి:  MRI Scanning | మరో 9 ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ సేవలు : మంత్రి రాజనర్సింహ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *