అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy CLP | తెలంగాణ శాసనసభ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశం మొదలైంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో ( Mahesh Kumar Goud ) పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Revanth Reddy CLP | స్పష్టమైన మార్గదర్శకాలు..
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం, విపక్షాల విమర్శల నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం సాధించిన విజయాలను ఏ విధంగా వివరించాలనేదానిపై ఈ సమావేశంలో విస్తృతంగా మంతనాలు సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను సభలో ఎలా తిప్పికొట్టాలి, ఏయే విషయాలపై దృష్టి పెట్టాలనే అంశాలపై ప్రజాప్రతినిధులకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గదర్శకాలు అందజేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: MRI Scanning | మరో 9 ఆస్పత్రుల్లో ఎంఆర్ఐ సేవలు : మంత్రి రాజనర్సింహ