Bigg Boss Telugu 10| బిగ్ బాస్ 10 డేంజర్ జోన్‌లో కామన్ మ్యాన్!

బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో జరుగుతున్న మహాపరీక్ష ప్రేక్షకులకు బిగ్‌ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bigg Boss Telugu 10 | బిగ్ బాస్  ( Bigg Boss ) తెలుగు 10 హౌస్‌లో జరుగుతున్న మహాపరీక్ష ప్రేక్షకులకు బిగ్‌ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. సాధారణంగా జరిగే వారాంతపు ఎలిమినేషన్‌కు భిన్నంగా, ఈసారి ఏకంగా వారం మధ్యలోనే (మిడ్-వీక్) ఒక ఎలిమినేషన్ జరగనుండటం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Bigg Boss Telugu 10 | పెరుగుతున్న విభేదాలు..

తాజా సమాచారం ప్రకారం, హౌస్‌లో సామాన్యుడిగా అడుగుపెట్టిన కంటెస్టెంట్ ఆర్జే చరణ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, హౌస్‌లో మాత్రం ఆ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు త్రిగుణ్, రోహిత్‌ల మధ్య పెరుగుతున్న విభేదాలు ఆటను మరింత రంజుగా మారుస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడైన చరణ్ ఊహించని విధంగా మిడ్-వీక్ ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉందన్న వార్త ప్రేక్షకులను విస్మర్యానికి గురిచేస్తోంది. మహాపరీక్షలో ఆర్జే చరణ్ తొలి బాధితుడు అవుతాడా? లేక బిగ్ బాస్ ఏదైనా అనూహ్య మలుపు తిప్పుతాడా? అనేది  తేలనుంది.

ఇది కూడా చదవండి:  Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *