అక్షరటుడే, వెబ్డెస్క్: Inter Caste Marriage | కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారని యువకుడి ఇంటిని యువతి కుటుంబసభ్యులు కూల్చేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా (Gadwal District)లో చోటు చేసుకుంది.
గద్వాల్ రూరల్ మండలం రేపల్లె గ్రామానికి చెందిన ప్రభుదాస్ కుమారుడు రంగముని (26), అదే గ్రామానికి చెందిన ఈరన్న కుమార్తె మహేశ్వరి (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రంగముని హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మహేశ్వరి అక్కడే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వేర్వేరు కులాలకు చెందిన వీరు ప్రేమించుకున్నారు. బుధవారం పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు.
Inter Caste Marriage | రెండు ఇళ్ల కూల్చివేత
పోలీసులు రేపల్లి నుంచి యువతి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. తాను మేజరు అని, ఇష్టపూర్వకంగానే రంగమునిని పెళ్లి చేసుకున్నానని మహేశ్వరి చెప్పింది. దీంతో వారు ఆగ్రహంతో ఇంటికి వెళ్లారు. అనంతరం యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ట్రాక్టర్లు, గడ్డపారలతో ఇంటిని కూల్చివేశారు. అక్కడే ఉన్న రంగముని చిన్నాన్న ఇంటిని కూడా కూల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: CPS Pension Issues | రిటైర్డ్ ఉపాధ్యాయుడి చేతికి పల్లీల బుట్ట.. సీపీఎస్ ఇచ్చిన ఘన మైన కానుక.. నేతలకేమో మల్టీపుల్ పెన్షన్లు!