అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Five Day Banking | ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో (Nizamabad) జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు.
Five Day Banking | పనిఒత్తిడితో అల్లాడుతున్నాం
యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్బీఐ, సెబీ, ఎల్ఐసీ వంటి సంస్థలకు ఇప్పటికే ఐదురోజుల పనివిధానం అమల్లో ఉందన్నారు. అయితే బ్యాంకులకు కూడా ఈ విధానం అమలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. బ్యాంకు ఉద్యోగులు పనివేళలు ముగిసినప్పటికీ ఆ రోజు పనిని పెండింగ్లో పెట్టకుండా పూర్తిచేస్తున్నారన్నారు. సెలవు దినాల్లోనూ విధులు నిర్వర్తించాల్సి వస్తోందన్నారు. సాంకేతికత పెరిగినా పనిభారం మాత్రం తగ్గడం లేదని వాపోయారు. అలాగే ఎన్పీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని.. పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూఎఫ్బీయూ నిజామాబాద్ యూనిట్ కన్వీనర్ రమేష్, గురునాథ్, రాజు, మనోజ్ సింగ్, వంశీ, సందీప్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Transformer Copper Theft | జల్సాల కోసం చోరీలు.. అన్నదమ్ముల ముఠా గుట్టురట్టు..