అక్షరటుడే, వెబ్‌డెస్క్ : గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. ఉషారాణి నూతనంగా నియమితులయ్యారు. ఆమెను గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ఇందిర, వైస్ ప్రిన్సిపాల్స్ డా. ఎస్. చంద్రశేఖర్, డా. బి.వి. నాగమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ శ్రీ వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Gandhi Hospital |మెరుగైన వైద్య సేవలు
ఆమెకు అభినందనలు తెలియజేశారు. డా. ఉషారాణి నాయకత్వంలో గాంధీ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆమె పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Khairatabad Ganesh | వినాయక ఉత్సవాలు.. ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు