Konda Surekha | హైకమాండ్ పిలుపు.. కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి?

వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Surekha | వరంగల్ జిల్లా  ( Warangal )కాంగ్రెస్ రాజకీయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవలే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి తొలిసారిగా తమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చిస్తున్న ఈ భేటీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Konda Surekha | వర్షం కారణంగా మారిన వేదిక..

తొలుత హనుమకొండ   రాంనగర్‌లోని కొండా సురేఖ నివాసంలోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, వరంగల్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా కార్యకర్తల సౌకర్యార్థం వేదికను స్థానిక ఒక ప్రముఖ హోటల్‌కు అత్యవసరంగా మార్చారు. బర్తరఫ్ తర్వాత నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కొండా అనుచరులు, ముఖ్య నేతలు తరలివచ్చారు.

Konda Surekha | హైకమాండ్ హామీలు..

మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం కొండా సురేఖను బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు త్వరలోనే కేబినెట్ హోదాతో కూడిన ఒక కీలక పదవిని కట్టబెట్టే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక హోటల్‌లో కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం, కొండా సురేఖ నేరుగా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్ఠానంతో జరిగే చర్చల తర్వాతే కొండా దంపతులు తమ తదుపరి రాజకీయ అడుగుపై స్పష్టతనివ్వనున్నారు.

ఇది కూడా చదవండి: AI Human Risk | ఏఐ మనుషులను చంపుతుందా.. ఆంత్రోపిక్​ సీఈవో కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *