అక్షరటుడే, వెబ్డెస్క్ : Ganesh Immersion | కర్ణాటకలో వినాయక నిమజ్జన ఊరేగింపును మసీదు మీదుగా తీసుకెళ్లవద్దని పోలీసులు సూచించినట్లు సమాచారం. మైసూర్ (Mysore)లో పోలీసులు జారీ చేసిన ఈ ఆదేశం కాంగ్రెస్, బీజేపీల మధ్య మరోసారి ఘర్షణకు దారితీసింది. కాంగ్రెస్ “హిందూ వ్యతిరేక” వైఖరిని అవలంబిస్తోందని బీజేపీ ఆరోపించింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో నగరంలోని టి. నరసిపూర్ ప్రాంతానికి చెందిన ఒక పోలీసు అధికారి నిర్వాహకులతో మాట్లాడారు. ఆ సమయంలో ఊరేగింపు మసీదు మీదుగా వెళ్లడం కనిపిస్తే తాను చర్య తీసుకుంటానని హెచ్చరించారు. పండుగ అంటే ఇతరులు మిమ్మల్ని గౌరవించేలా ఉండాలి. కానీ మీరందరూ వెళ్లి మసీదు ముందు బాణసంచా కాలుస్తారు. ఈసారి అలా చేయడం కనిపిస్తే, నేను కఠినంగా వ్యవహరిస్తానని ఆయన అన్నారు.
Ganesh Immersion | బీజేపీ ఆగ్రహం
సదరు పోలీస్ అధికారి వీడియో వైరల్ కావడంతో బీజేపీ (BJP) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హిందూ వ్యతిరేక చర్య అని పేర్కొంటూ ఎంపీ యదువీర్ వాడియార్ అన్నారు. అధికారులు శాంతిభద్రతలను కాపాడుతూనే మతపరమైన ఊరేగింపు సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ప్రభుత్వం హిందువులను, వారి సంప్రదాయాలను అగౌరవపరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు.
VIDEO | Mysuru: Pro-Hindu organisations, BJP hold protest on ‘no permission’ for Ganesh Chaturthi procession, police clarify that all permissions are available if prior notice given.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/WBSIZ12sbi
— Press Trust of India (@PTI_News) September 13, 2026
దీనిని కూడా చదవండి : Weapons Theft Case | ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. మాజీ హవిల్దార్ మల్లేశ్ కస్టడీకి కోర్టు అనుమతి