అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 15 Market Analysis | అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తడంతో ప్రపంచ ఇంధన మరియు షిప్పింగ్ మార్గాలకు ఆటంకాలు ఎదురుకావొచ్చన్న ఆందోళనలతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి.
దీంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్, యూరోప్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం జపాన్, చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ సూచీలకు సానుకూల ప్రారంభాన్ని సూచిస్తోంది.
Sep 15 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
యూఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల ఉన్నతాధికారులు భద్రతాపరమైన ఆందోళనలను వ్యక్తం చేసి, ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్విడియా తదితర చిప్‌మేకర్లు నష్టపోయారు. ఈ నేపథ్యంలో గత సెషన్‌లో నాస్‌డాక్ 0.56 శాతం, ఎస్ అండ్ పీ 0.48 శాతం పడిపోయాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం నష్టంతో ఉంది.
Sep 15 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.76 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.50 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.44 లాభంతో ముగిసింది.
Sep 15 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జపాన్‌కు చెందిన నిక్కీ 0.91 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.13 శాతం లాభాలతో ఉండగా.. సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.18 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.40 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.14 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.02 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.33 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 930 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు వరుసగా 24 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,968 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 95.55 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.61 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5 వద్ద ఉన్నాయి.
- సౌదీ అరేబియా ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడుల కారణంగా సరఫరా అంతరాయాలపై ఆందోళనలు కొనసాగడంతో మంగళవారం చమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్ల వద్ద ఉంది.