Stock Market Losses | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | పశ్చిమాసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ పంపిన 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడం, హార్మూజ్ విషయంలో అమెరికా, చైనాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగలి లేకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.

దీంతో అప్రమత్తమైన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లన్నీ (Stock Markets) ఎరుపెక్కాయి. గ్లోబల్ మార్కెట్లనుంచి అందుతున్న బలహీనమైన సంకేతాలు, రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోనూ పడిపోవడం వంటి కారణాలతో మన మార్కెట్లు సైతం మధ్యాహ్నం తర్వాత నష్టాల బాట పట్టాయి.

Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో ప్రారంభమై తొలుత 246 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని 619 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో ప్రారంభమెనా మొదట్లో 26 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 176 పాయింట్లు లాభపడింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే గరిష్టాలనుంచి సెన్సెక్స్ 731 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 160 పాయింట్ల లాభంతో 75,237 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 23,643 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | మిక్స్‌డ్ గా ఇండెక్స్‌లు..

నిఫ్టీ (Nifty)లో మీడియా ఇండెక్స్ 1.98 శాతం, ఐటీ 1.30 శాతం, ఎఫ్ ఎంసీఈ 0.54 శాతం, టెలికాం 0.44 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడగా.. మెటల్ 1.93 శాతం, రియాలిటీ 1.79 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.67 శాతం, ఎనర్జీ 1.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1 శాతం నష్టపోయాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,705 కంపెనీలు లాభపడగా 2,471 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 47 కంపెనీలు 56 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్ లాభపడగా.. 16 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ 2.08 శాతం, టెక్ మహీంద్రా 2.04 శాతం, పవర్‌గ్రిడ్ 1.34 శాతం, అదానీ పోర్ట్స్ 1.27 శాతం, మారుతి 1.13 శాతం లాభపడ్డాయి.

Top Losers : టాటా స్టీల్ 1.97 శాతం, ఎటర్నల్ 1.93 శాతం, రిలయన్స్ 1.87 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.87 శాతం, ఎస్ బీఐ 1.69 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Honda NX500 | ఇక క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకోవచ్చు.. అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసిన హోండా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *