అక్షరటుడే, వెబ్డెస్క్: Bandlaguda Murder | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు వెంబడించి హత్య చేశారు.
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వేట కొడవళ్లు, కత్తులతో వెంట పడి ఒకరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. నిందితులు వెంటబడటంతో ఆ వ్యక్తి ఓ వైన్ షాపులో తలదాచుకున్నాడు. ఆ విషయాన్ని గమనించిన నిందితులు బయటకు లాగి మరి దాడి చేశారు. కత్తులు, కొడవళ్లతో దాడి చేయడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Bandlaguda Murder | పాత కక్షలతో..
మృతుడు ఇల్లెందుకు చెందిన రౌడీ షీటర్ నయీమ్గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. వైన్ షాపు సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్యతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
ఇది కూడా చదవండి..: Gold Ganesha Idol | బంగారు కాంతుల్లో కొలువైన విఘ్నేశ్వరుడు.. ఫీల్ఖానాలో భక్తుల మనసు దోచుకుంటున్న వజ్రాల గణపతి