అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. యెమెన్‌కు చెందిన ఇరాన్ అనుకూల హౌతీలు సౌదీ అరేబియాపై దాడులు చేస్తుండడం, గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో జరగాల్సిన చర్చలను వాయిదా వేయడంతో పరిస్థితి మరింత క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో గల్ఫ్ ప్రాంతం నుంచి ఇంధన సరఫరాలకు అంతరాయాలు కలగవచ్చన్న ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లు దాటింది.
Stock Market Losses | వడ్డీ రేట్ల పెంపు భయాలు..
పెరుగుతున్న చమురు ధరల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. ఆగస్టులో భారతదేశపు రిటైల్ ద్రవ్యోల్బణం మరింత వేగవంతమైంది. దీంతో కేంద్ర బ్యాంకు వచ్చే నెలలో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. చమురు ధరల కారణంగా ఈ వారం చివరలో అమెరికా సైతం వడ్డీ రేట్ల పెంచవచ్చన్న అంచనాలు ఎక్కువవుతున్నాయి.
Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..
దేశీయ మార్కెట్లు (Domestic markets) మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 588 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 67 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 853 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 178 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 16 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 281 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 79 పాయింట్ల నష్టంతో 74,702 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 23,344 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 11 స్టాక్స్ లాభాలతో, 19 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. హెచ్సీఎల్ టెక్ 6.04 శాతం, టీసీఎస్ 4.96 శాతం, ఇన్ఫోసిస్ 4.25 శాతం, టెక్ మహీంద్రా 3.94 శాతం, హెచ్యూఎల్ 1.73 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers | బీఈఎల్ 3.46 శాతం, టైటాన్ 2.10 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.83 శాతం, ఇండిగో 1.81 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.79 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 15 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై ఒత్తిడి.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు