అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Medical Jobs | జిల్లా (Nizamabad) కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కళాశాల ప్రినిపాల్ డాక్టర్ ఎన్.కృష్ణమోహన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
Nizamabad Medical Jobs | కళాశాలలో..
ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు ప్రొఫెసర్ పోస్టులు, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 51 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే 15 ట్యూటర్ ఉద్యోగాలు, ఆరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి డీఎంఈ నుంచి ఆదేశాలు అందాయని పేర్కొన్నారు. ఆయా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి అనుమతి లభించిందన్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల పనిదినాల్లో సాయంత్రం 4 గంటల్లోపు నిర్దేశించిన తేదీల్లో అందజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఈనెల 22వ తేదీన ఉదయం 10.30కు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఖాళీలు, వేతన వివరాల కోసం కళాశాల వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Banswada Tribal Issues | కాంగ్రెస్ పాలనలో గిరిజనులకు అన్యాయం..: బాజిరెడ్డి గోవర్ధన్