Irrigation Bribery Allegations | ఇరిగేషన్ శాఖలో అవినీతి కలకలం.. లంచం తీసుకుని పనిచేయట్లేదని రిటైర్డ్ ఉద్యోగిని ఆందోళన

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Irrigation Bribery Allegations | జిల్లా కేంద్రంలోని (Kamareddy) ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో (Irrigation Department) అవినీతి ఆరోపణలు కలకలం రేపాయి. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ఫైల్ సిద్ధం చేసేందుకు అధికారులు లంచం తీసుకుని కూడా పని చేయడం లేదని ఆరోపిస్తూ ఆ ఉద్యోగిని కార్యాలయంలో ఆందోళనకు దిగారు.

Irrigation Bribery Allegations | ఫైళ్లు సిద్ధం చేసే క్రమంలో..

ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ చేసిన జ్యోతి తనకు రావాల్సిన ఉద్యోగ విరమణ ప్రయోజనాల ఫైళ్లను సిద్ధం చేయాలని కోరింది. అయితే ఫైల్ సిద్ధం చేసేందుకు కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సిబ్బంది రూ.5వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేశారని జ్యోతి ఆరోపించారు. డబ్బులు ఇచ్చినా ఇప్పటి వరకు ఫైల్ సిద్ధం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విసిగిపోయిన జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టింది. సూపరింటెండెంట్​తో వాగ్వాదానికి దిగింది. జూనియర్ అసిస్టెంట్ కార్యాలయంలో లేకపోవడంతో ఫోన్ ద్వారా నిలదీసింది. విషయం తెలుసుకున్న తోటి ఉద్యోగులు కల్పించుకొని సూపరింటెండెంట్​పై ఒత్తిడి తెచ్చి రిటైర్డ్ ఉద్యోగి పని పూర్తి చేయాలని సూచించారు. దీంతో రెండు రోజుల్లో ఫైల్ పూర్తి చేస్తానని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఫైల్ సిద్ధం కాకపోవడంతో తనకు పెన్షన్ రావడం లేదని, లోన్లు ఉండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.  లంచం తీసుకుని పని చేయని అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Irrigation Bribery Allegations | నిర్లక్ష్యం ఏమీ లేదు

ఈ విషయమై నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ భీమరాజును వివరణ కోరగా రిటైర్డ్ ఉద్యోగిని జ్యోతి ఫైల్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని తెలిపారు. సంతకం చేసే ఉద్యోగి లీవ్ లో ఉండడం వల్ల ఆలస్యం అయిందని పేర్కొన్నారు. అలాగే డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించడంలో ఎలాంటి నిజం లేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: దళితులు దాడిచేయడం ఖాయం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *