అక్షరటుడే, వెబ్‌డెస్క్: Market Relief Rally | పెరిగిన ముడి చమురు ధరలు, ఐపీవోల తాకిడితో కుదేలవుతున్న సెకండరీ మార్కెట్.. బుధవారం కాస్త కోలుకుంది. ఎఫఎంసీజీ, ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాట పట్టాయి.
Market Relief Rally | లాభాలతో ప్రారంభమై..
దేశీయ మార్కెట్లు (Domestic Markets) బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 246 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమైనా కొంత ఒత్తిడిని ఎదుర్కొని 268 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో 524 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే 85 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి కోలుకుని 165 పాయింట్లు ఎగబాకింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 337 పాయింట్ల లాభంతో 74,340 వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 23,234 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 21 స్టాక్స్ లాభాలతో, 9 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఐటీసీ 2.27 శాతం, బీఈఎల్ 2.13 శాతం, హెచ్యూఎల్ 1.82 శాతం, ట్రెంట్ 1.74 శాతం, ఎస్బీఐ 1.71 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టీసీఎస్ 1.60 శాతం, ఇండిగో 0.98 శాతం, ఇన్ఫోసిస్ 0.84 శాతం, ఎల్టీ 0.71 శాతం, టెక్ మహీంద్రా 0.64 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 16 Gold Prices | పసిడి ప్రియులకు ఊరట.. వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు!