అక్షరటుడే వెబ్‌డెస్క్: iBomma Ravi | ఒకప్పుడు విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో, తన బ్యాంకు ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయాలని కోరుతూ ఆయన నాంపల్లి కోర్టులో ( Nampally Court ) పిటిషన్ దాఖలు చేశారు.
iBomma Ravi | తీవ్ర ఇబ్బందులు..
పైరసీ సినిమాల కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రవిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తుల డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. అయితే, అకౌంట్లు అన్నీ మూతపడటంతో నిత్యవసరాలు, కుటుంబ పోషణ, వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కనీస జీవన అవసరాల కోసమైనా తన ఫ్రీజ్ అయిన ఖాతాలలో కొన్నింటినైనా తెరిచేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ విషయమై పోలీసుల వివరణ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
iBomma Ravi | అసలు ఏం జరిగిందంటే..?
ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ రవి కోట్ల రూపాయలు ఆర్జించారనే గట్టి ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో తనను పట్టుకోవడం ఎవరివల్లా కాదంటూ ఆయన పోలీసులకు సవాల్ కూడా విసిరారు. ఈ సవాల్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, ఆయన హైదరాబాద్‌కు వచ్చిన సమయములో ప్రత్యేక నిఘా పెట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బయటకు వచ్చిన రవి.. ఇప్పుడు ఆర్థిక సమస్యలతో కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Disabled Persons Protest | బషీర్‌బాగ్ వద్ద ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి దివ్యాంగుల యత్నం