అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA Flood Risk | పట్టణీకరణతో నీటి వనరులు, చెరువులు కబ్జాలకు గురి అవుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. దీంతో భారీ వర్షాలు పడినప్పుడు నగరాలను వరద ముంచెత్తుతోందని చెప్పారు.
వరదలు వచ్చినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణలో ప్రభుత్వ విభాగాలతో పాటు యువ ఆపదమిత్రులు కూడా సిద్ధంగా ఉండాలని హైడ్రా కమిషనర్ కోరారు. నాగోల్‌లోని హైడ్రా శిక్షణ కేంద్రంలో యువ ఆపదమిత్ర 5వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. నగరంలో 69 శాతం చెరువులు కబ్జాకు గురయ్యాయని చెప్పారు. చెరువులను కాపాడుకుంటే వరదలు కట్టడి చేయొచ్చన్నారు. అందుకే హైడ్రా చెరువుల పరిరక్షణకు కృషి చేస్తోందని తెలిపారు.
HYDRAA Flood Risk | అక్రమ కట్టడాలతో..
నగరంలో అక్రమ కట్టడాలు భూకంపాలతో సమానమైన ప్రమాదాన్ని సూచిస్తున్నాయని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. కేవలం 50 గజాలలో ఏడెనిమిది అంతస్తులు భవనాలు నిర్మించడంతో పరిసర ప్రాంత నివాసితులకు అవి ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 5వ బ్యాచ్‌లో శిక్షణ పొందుతున్న 117 మంది వలంటీర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన వివిధ కళాశాలల విద్యార్థులు కనుక హైడ్రాతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
దీనిని కూడా చదవండి : Harish Rao Counter | సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్