Praja Palana Day | కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నగరంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Praja Palana Day | కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నగరంలోని ​ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

Praja Palana Day | ఎందరో త్యాగాల ఫలం..

నగేష్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ (Hyderabad) నిజాం పాలనలో బందీగా ఉన్నప్పుడు ఎన్నో పోరాటాల తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఎంతోమంది త్యాగాల వల్ల తెలంగాణకు విముక్తి లభించిందన్నారు.  ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, తారా చాంద్, రాజేంద్ర ప్రసాద్, యాదగిరి, ప్రవీణ్ గౌడ్, రవి, మీసాల సుధాకర్, లింగం, కౌడపు రఘు, ముస్తఫా, కోనేరు సాయికుమార్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Narendra Modi Birthday | నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్ర మోదీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *