Hari Babu Murder | యూట్యూబర్​ వైష్ణవి హత్య కేసులో నిందితుడి దారుణ హత్య..!

రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ యూట్యూబర్​ వైష్ణవి హత్య కేసులో నిందితుడు నిజామాబాద్ నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Hari Babu Murder | రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రముఖ యూట్యూబర్​ వైష్ణవి (YouTuber Vaishnavi Case) హత్య కేసులో నిందితుడు నిజామాబాద్ ​(Nizamabad) నగరంలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది.

Hari Babu Murder | ప్రేమ పెళ్లి చేసుకుని..

కోరుట్లకు చెందిన ప్రముఖ యూట్యూబర్​ వైష్ణవి, హరిబాబు 2025లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2026 మార్చి 17వ తేదీన వైష్ణవి ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. కత్తితో దాడి చేసి హరిబాబు ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ క్రమంలో పోలీసులు సాక్ష్యాధారాలతో హరిబాబును అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. అతడి తల్లి, అన్నలు చెప్పినట్లు విని హరిబాబు తరచూ వైష్ణవిని అదనపు కట్నం కోసం వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు విచారణలో తేల్చారు. అనంతరం అతడు రిమాండ్​ నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Hari Babu Murder | రెక్కి చేసి.. వేటు వేసి..

అయితే హరిబాబు నిజామాబాద్​కు వచ్చినట్లుగా తెలుసుకున్న ముగ్గురు ఆగంతకులు కారులో వచ్చి నగరంలోని రాజారాజేంద్ర వద్ద రోడ్డు పక్కన నిలబడ్డ హరిబాబుపై దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న కత్తితో వేటు వేసి హతమార్చారు. అనంతరం క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. హత్య చేసిన వ్యక్తుల వివరాలు తెలియరాలేదు.

ఇది కూడా చదవండి : ఘాట్ రోడ్డులో ప్రమాదం మహిళ మృతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *