RI Death Incident | గన్​ మిస్​ఫైర్​.. ఆర్​ఐ మృతి

నిజామాబాద్​ నగరంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ గన్​ మిస్​ ఫైర్​ అయి మృతి చెందారు. 

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: RI Death Incident | నిజామాబాద్​ నగరంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (RI) హెచ్ సతీష్ గన్​ మిస్​ ఫైర్​ అయి మృతి చెందారు. విధులు ముగించుకుని వచ్చిన అనంతరం ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలడంతో అక్కడికక్కడే చనిపోయారు.

RI Death Incident | డ్యూటీ ముగించుకుని వచ్చాక దుర్ఘటన

సీపీ సాయిచైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్​వో (NSO) డ్యూటీ ముగించుకుని హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చిన ఆర్ఐ సతీష్, ఉదయం సమయంలో తన ఆయుధాన్ని క్లీన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయి గుండు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

RI Death Incident | ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ

విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం పట్ల పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు.

 

ఇది కూడా చదవండి..: Nizamabad RI Suicide | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో విషాదం..సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆర్ఐ సతీష్ ఆత్మహత్య!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *