అక్షరటుడే, గాంధారి: Gandhari Ganja Cultivation | తక్కువ సమయంలో ఎక్కడ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు పెడదారి పడుతున్నారు. ఈ క్రమంలో గంజాయిని పండిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నారు.
Gandhari Ganja Cultivation | గాంధారి మండలంలో..
కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలో గంజాయి గాంధారి (Gandhari) నుంచి దూర ప్రదేశాలకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ గంజాయికి అలవాటుపడుతున్న యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక నెల వ్యవధిలోనే దాదాపు 400 చెట్లు, రెండు కిలోల ఎండు గంజాయి గాంధారి మండల పరిధిలోనే పట్టుబడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Gandhari Ganja Cultivation | దూర ప్రాంతాలకు తరలిస్తూ..
గాంజాను దూరప్రాంతాలకు తరలిస్తే రేటు ఎక్కువ పలుకుతుందనే ఉద్దేశంతో మండల పరిధిలోని గ్రామాల్లో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరు మైనర్లు పట్టుబడగా వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
గాంధారి మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రి శివారులో ఉన్న ఓ వ్యవసాయ భూమిలో వేరువేరు తండాలకు చెందిన వ్యక్తులు కౌలుభూమిలో యజమానికి తెలియకుండా దాదాపు పత్తి పంటలో 400 పైగా గంజాయి మొక్కలు పెంచడాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే గాంజా పంటను స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కూడా అరెస్టు చేశారు.
Gandhari Ganja Cultivation | పోలీసుల అవగాహన కల్పిస్తున్న ఫలితం శూన్యం…
డ్రగ్స్ వినియోగించొద్దని, గంజాయి సాగు చేయొద్దని పోలీసులు విస్తృత ప్రచారం చేసినా.. ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది. గంజాయి వల్ల దుష్ఫరిణాలను యువతకు కళ్లకు కట్టినట్లుగా చూపించినప్పటికీ కొందరు మారట్లేదు.
స్కూళ్లు, కళాశాలల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని.. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అలర్ట్ అయి వారిని మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ACB Trap Case | ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్