IIT Bombay Student | బాంబే ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య

పరీక్ష సమయంలో చాట్ జీపీటీ ఉపయోగిస్తు దొరికిన ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IIT Bombay Student | బాంబే (Bombay) ఐఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో విద్యార్థులు నిరసన చేపట్టగా క్యాంపస్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సంస్థ తెలిపిన వివరాలు ప్రకారం.. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సాహిల్ వకోడే అనే ఆ విద్యార్థి పరీక్ష సమయంలో సమాధానాలు తెలుసుకోవడానికి ప్రశ్నపత్రాన్ని ‘ChatGPT’లో అప్‌లోడ్ చేశాడు. ఆ సమయంలో ప్రొఫెసర్లు అతడిని పట్టుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. సాహిల్​తో ప్రొఫెసర్​, హెచ్​వోడీ మాట్లాడి కౌన్సెలింగ్​ ఇచ్చారని చెప్పారు. అనంతరం హాస్టల్​కు వెళ్లిన అతడు సాయంత్రం తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

IIT Bombay Student | విద్యార్థుల నిరసన

ఐఐటీ బాంబే క్యాంపస్​లో గత 7 నెలలో ఇది మూడో ఆత్మహత్య. ఫిబ్రవరిలో సెకండియర్​ విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. జూలైలో కొత్త సెమిస్టర్ ప్రారంభంలో B.Tech విద్యార్థి తనువు చాలించాడు. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో క్యాంపస్​లో విద్యార్థులు నిరసనలు ప్రారంభించారు. చీటింగ్​ ఆరోపణలు ఎదుర్కొన్న ఆ విద్యార్థిని ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తామని బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. దీంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Rozgar Mela 2026 | కేంద్రం మరో శుభవార్త.. రేపు 51 వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *