Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు.. ఆ జిల్లాలకు కొత్త అధ్యక్షులు!

రాబోయే ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు తెచ్చే దిశగా ఈ బాధ్యతలను అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్షాళన, బలోపేతంలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమిస్తూ నిర్ణయం తీసుకోగా, ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు.

Telangana DCC Presidents Appointed | సంగఠన్ సృజన్ అభియాన్..

AICC ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘సంగఠన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.

TASK Dell Tech Training | యువతకు ‘డెల్’ టెక్ స్కిల్స్.. టాస్క్, డెల్ భాగస్వామ్యంలో ప్రతిష్ఠాత్మక ‘ఉడాన్’ ప్రాజెక్ట్!

ఇవే ఆ నియామకాలు..

  • రామగుండం కార్పొరేషన్: MD. ముస్తఫా
  • రంగా రెడ్డి జిల్లా: చిగిరింత పారిజాత
  • సంగారెడ్డి జిల్లా: పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

రాబోయే ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు తెచ్చే దిశగా ఈ బాధ్యతలను అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *