అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rain Forecast | తెలంగాణలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సైతం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి వాన దంచికొట్టింది. వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నేడు రాత్రి సైతం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వికారాబాద్, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్ (Medak), సిద్దిపేట జిల్లాల్లో రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అయితే ఈ వర్షాలు విస్తారంగా కాకుండా అక్కడక్కడే పడుతాయని అధికారులు తెలిపారు.
Rain Forecast | అల్పపీడన ప్రభావంతో..
సెప్టెంబర్ 23న ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాన్ని బలమైన అల్పపీడనం (LPA), వాయుగుండం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 23 నుండి 25 మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
దీనిని కూడా చదవండి : Home Loan Tips | హోమ్‌లోన్ తీసుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి