Rahul Gandhi Controversy | మహిళలను అవమానించిన రాహుల్ గాంధీ : బీజేపీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Rahul Gandhi Controversy | కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ (BJP) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మహిళలను అవమానించారని మండిపడ్డారు.

ఇండోర్‌లో శనివారం నిర్వహించిన ‘ఛత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో మోదీ (PM Modi)ని అనుకరిస్తూ.. ఒక స్టాండప్​ కమెడియన్​తో రాహుల్​ స్కిట్​ చేయించారు. ఇందులో ప్రధానిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. సదరు స్టాండప్​ కమెడియన్​ నవ్వుతూ మోదీని అవమానించేలా ప్రవర్తించగా.. రాహుల్​ గాంధీ సైతం ఆయనను ప్రోత్సహించారు. ఈ వీడియో వైరల్​ అయింది. దీనిపై పలువురు బీజేపీ నాయకులు ఆదివారం స్పందించారు.

Rahul Gandhi Controversy | తల్లిని ఎగతాళి చేశారు

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కేశవన్ మాట్లాడుతూ ఒక తల్లిని ఎగతాళి చేయడం ద్వారా రాహుల్ మహిళలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆలోచించే ఏ వ్యక్తి కూడా ఈ అసభ్యకరమైన, నాసిరకమైన చేష్టలను చూసి నవ్వరని, కానీ రాహుల్ వారితో కలిసి ఉన్న వేదికపై బిగ్గరగా నవ్వుతూ కనిపించారన్నారు. ఇలాంటి చర్యలతోనే ఆయన యువతను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ వైఫల్యాన్ని కాంగ్రెస్ సొంత నాయకుడు శశి థరూర్ కూడా అంగీకరించారని గుర్తు చేశారు.

Rahul Gandhi Controversy | అందుకే ఓడిపోయారు

రాహుల్ గాంధీ ద్వేషపూరిత రాజకీయాల వల్లే ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విద్యార్థి విభాగం ఎన్​ఎస్​యూఐ ఓడిపోయిందని కేశవన్​ అన్నారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీ నైతిక దివాలాలో పాతాళానికి దిగజారారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడి భాష మరింత అధ్వాన్నంగా దిగజారుతోందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

 

దీనిని కూడా చదవండి : Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు.. ఆ జిల్లాలకు కొత్త అధ్యక్షులు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *