Tirumala Brahmotsavam | స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala Brahmotsavam | తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడవీధుల్లో విహరించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన స్వర్ణరథోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. గ్యాలరీలు అన్ని నిండిపోయాయి. మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగాయి.

Tirumala Brahmotsavam | రథాన్ని లాగిన మహిళలు

రథోత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తితో స్వామివారి రథాన్ని లాగారు. గజరాజులు ముందు వెళ్తుండగా, కళాకారుల ప్రదర్శనసల మధ్య, మంగళవాయిద్యాల నడుమ స్వర్ణరథం మాడ వీధుల్లో ముందుకు సాగింది. ఈ దృశ్యాన్ని చూసి భక్తజనం పులకించిపోయారు. టీటీడీ (TTD) ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు సిహెచ్. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

 

దీనిని కూడా చదవండి : lift accident | లిఫ్ట్​లో ఇరుక్కున్న వ్యక్తి.. కాపాడిన హైడ్రా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *