Drinking Water Wastage | తాగునీటి వృథా.. ఐదుగురికి జరిమానా

తాగునీరు వృథా చేసిన ఐదుగురికి జలమండలి అధికారులు జరిమానా వేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Drinking Water Wastage | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో పలువురు జలమండలి సరఫరా చేసే నీటిని వృథా చేస్తున్నారు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నీటిని పొదుపుగా వాడాలని, వృథా చేయొద్దని జలమండలి అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. పలువురు పట్టించుకోవడం లేదు. తాగునీటితో ఫ్లోర్లు, వాహనాలు కడుగుతున్నారు. ఇలాంటి వారిని అధికారులు మొదట హెచ్చరిస్తున్నారు. అయినా మారకపోతే జరిమానాలు విధిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఫైన్​ వేస్తున్నారు. ఫైన్​ వేసిన తర్వాత కూడా మళ్లీ నీటిని వృథా చేస్తే నల్లా కనెక్షన్​ కట్ చేస్తామని హెచ్చరించారు.

Drinking Water Wastage | జూబ్లీహిల్స్‌లో తనిఖీలు

తాగునీటి వృథాను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం నీటి సరఫరా సమయంలో జూబ్లీహిల్స్​లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాగునీటిని వృథా చేస్తున్న ఐదుగురు వినియోగదారులను గుర్తించారు. వారికి జరిమానా వేశారు. నీటి వృథాను అరికట్టడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఇకపై తనిఖీలు ముమ్మరం చేస్తామని, రెండో సారి నీరు వృథా చేస్తూ దొరికితే కనెక్షన్ తొలగిస్తామని స్పష్టం చేశారు. జలమండలి పరిధిలో సైతం నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టింది. పైప్‌లైన్ లీకేజీల కారణంగా నీరు వృథా కాకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.

ఇది కూడా చదవండి..: Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. ఉత్సవ సమితి నేతల అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *