Sthree Nidhi Electric Autos | స్త్రీనిధి రుణంతో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించడం కోసం స్త్రీ నిధి రుణం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Sthree Nidhi Electric Autos | మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించడం కోసం స్త్రీ నిధి రుణం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ఇద్దరు మహిళలకు స్త్రీనిధి ద్వారా రుణ సహాయంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను సోమవారం ఆయన పంపిణీ చేశారు.

Sthree Nidhi Electric Autos | స్త్రీనిధి రుణంతో..

బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు స్త్రీనిధి ద్వారా ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఇద్దరు లబ్ధిదారులకు మొత్తం రూ.6 లక్షల రుణ సహాయం లభించింది. రుణం పొందిన వారిలో దేశాయిపేట వీవో పరిధిలోని సాయి నందిని గ్రూప్​కు చెందిన మాసన్ పల్లి రజిత, సోమలింగేశ్వర గ్రూప్​నకు చెందిన బేపారి శోభ ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా స్త్రీనిధి రుణ సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆదాయాన్ని సమకూర్చే ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని, ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిరంతర ఆదాయం పొందేలా కృషి చేయాలని సూచించారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వివిధ రుణ సహాయ కార్యక్రమాలను అమలు చేస్తోందని, మరింత మంది మహిళలు స్వయం ఉపాధి కార్యకలాపాల వైపు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్​వై గిరి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీఆర్​వో పాండు, స్త్రీనిధి ఆర్ఎం కిరణ్, స్త్రీనిధి మేనేజర్, సీసీలు, సంబంధిత అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Rashmi Gautham Temple Visit | ​లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నటి రష్మీ గౌతమ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *