Illegal Sand Mining | ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు : సీఎస్​ సంజయ్​ జాజు

ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎస్​ సంజయ్​ జాజు ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Sand Mining | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (CS Sanjay Jaju) సోమవారం సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఖనిజ వనరుల సమర్థవంతమైన వినియోగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సీఎస్​ సూచించారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియలను నిబంధనల మేరకు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణా, అక్రమ తవ్వకాలు, అనధికారికంగా ఖనిజాల తరలింపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాలపై విజిలెన్స్​ బృందాలతో తనిఖీలు చేపట్టాలన్నారు.

Illegal Sand Mining | తక్షణమే స్పందించాలి

ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు వస్తే అధికారులు వెంటనే స్పందించాలని సీఎస్​ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆదాయం పెరిగేలా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ జనరల్ డి.ఎస్. చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్​ నిర్మాణానికి శంకుస్థాపన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *