Ganesh Bigala Pujas | గణపతి మండపాల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక పూజలు

గణపతి మండపంతో పాటు మారుతినగర్‌లో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన మండపాన్ని కూడా ఆయన సందర్శించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ganesh Bigala Pujas | వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పలు గణపతి మండపాలను మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల నిర్వాహకులు, భక్తులు ఆయనకు స్వాగతం పలికారు.

Ganesh Bigala Pujas | 60 అడుగుల ఎత్తైన విగ్రహం

పోచమ్మగల్లిలో రవితేజ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి వినాయక విగ్రహాన్ని గణేష్ బిగాల దర్శించుకున్నారు. నిర్వాహకుల వివరాల ప్రకారం.. సుమారు 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం బాలాజీ భవన్, పూసలగల్లిలో అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుని పూజలు చేశారు.

Trump Media Lawsuit | ట్రంప్‌పై CNN, MS NOW, Politico సంయుక్తంగా దావా!

తదుపరి కిషన్‌గంజ్‌లోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

akshara today .jpgbigala

Ganesh Bigala Pujas | ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి..

గాజుల్‌పేట్ టానాగల్లిలో వైశ్య భవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంతో పాటు మారుతినగర్‌లో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన మండపాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడ స్వామివారికి పూజలు నిర్వహించి, ఉత్సవాల నిర్వహణపై నిర్వాహకులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో సిర్ప రాజు, సత్య ప్రకాష్, దండు శేఖర్, జగత్ రెడ్డితో పాటు ఆయా గణపతి మండపాల నిర్వాహకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *