అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Railway Station | కామారెడ్డి రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పరిశీలించారు. ప్రత్యేక తనిఖీ రైలులో కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు రైల్వే అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
Kamareddy Railway Station | అభివృద్ధి పనులను..
కామారెడ్డి రైల్వే స్టేషన్‌తో పాటు పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైళ్ల రాకపోకలను మరింత సురక్షితంగా, క్షేమంగా నిర్వహించేందుకు చేపడుతున్న కవచ్ సాంకేతిక వ్యవస్థ అప్‌గ్రేడేషన్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ స్టేషన్ పథకం కింద కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి రైల్వే స్టేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక వెయిటింగ్ హాల్స్, ప్లాట్ ఫాంల ఆధునికీకరణ, లిఫ్టులు, ఎస్కలేటర్లు, పార్కింగ్ సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. కామారెడ్డి ప్రాంతంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీఎం తెలిపారు.
ఇది కూడా చదవండి..: Ganesh Immersion Preventive | వినాయక నిమజ్జనం ఎఫెక్ట్.. ముందస్తుగా పలువురి బైండోవర్