Kamareddy Ganesh Immersion | గణేష్​ శోభాయాత్ర ఎఫెక్ట్.. కామారెడ్డిలో ట్రాఫిక్ డైవర్షన్

కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganesh Immersion | కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో 23వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పలు మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా, శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పేర్కొన్నారు.

Kamareddy Ganesh Immersion | డైవర్షన్​ వివరాలివే..

కరీంనగర్, సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డి వచ్చే వాహనాలు సిరిసిల్ల బైపాస్, ఎన్‌హెచ్ 44, టేక్రియాల్ బైపాస్ మీదుగా రావాలి. కామారెడ్డి నుంచి అటువైపు వెళ్లే వాహనాలు కొత్త బస్టాండ్, ఇందిరాగాంధీ స్టేడియం, టేక్రియాల్ బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు అశోక్ నగర్, రైల్వే గేట్ మీదుగా కలెక్టర్ కార్యాలయం, గుమాస్తా కాలనీ, రామారెడ్డి వైపు లేదా ఓం శాంతి భవనం, రాజీవ్ నగర్, టీచర్స్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ మీదుగా వెళ్లాలి.

హైదరాబాద్ వెళ్లే వాహనాలు యథావిధిగా వెళ్లవచ్చని, హైదరాబాద్, పాత రాజంపేట నుంచి వచ్చే వాహనాలు టేక్రియాల్ బైపాస్, ఇందిరాగాంధీ స్టేడియం, కొత్త బస్టాండ్ మార్గంలో పట్టణంలోకి రావాలని పేర్కొన్నారు. శోభాయాత్ర ప్రారంభం నుంచి ముగిసే వరకు పట్టణంలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని, శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదని, డైవర్షన్లు నిమజ్జనం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: ప్రమాదకరంగా బైక్ స్టంట్స్.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *