అక్షరటుడే, వెబ్‌డెస్క్: Student Drug Arrest | పంజాబ్‌లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ బానిసలు అయ్యారు. అనంతరం వాటిని హైదరాబాద్ (Hyderabad) నగరంలో విక్రయిస్తూ దొరికారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్ సరస్వతీ కాలనీలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అనంతపురం జిల్లాకు చెందిన దేవరకొండ విద్యాశ్రీ, హైదరాబాద్ నగరానికి చెందిన కోడూరు విష్ణువర్ధన్ రెడ్డిగా గుర్తించారు. వీరు పంజాబ్‌లో చదువుతున్నారు. అక్కడ డ్రగ్స్‌కు బానిసలు అయ్యారు. అనంతరం డ్రగ్స్ కొనుగోలు, జల్సాలకు డబ్బుల కోసం డ్రగ్స్ దందాలోకి దిగారు. పంజాబ్ నుంచి ఓజీ కుష్, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.
Student Drug Arrest | గది అద్దెకు తీసుకొని
నిందితులు ఇద్దరు పంజాబ్‌లో కలిసి చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఆ గది కేంద్రంగా మాదకద్రవ్యాల విక్రయాలు చేపడుతున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.వారి నుంచి 9.6 గ్రాముల OG కుష్, 14 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2.40 లక్షల ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Ganesh Utsav | గణనాథుని సన్నిధిలో ఆధ్యాత్మిక సందడి.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు