అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Vote Theft | భారతదేశంలో ఎన్నికల నిర్వహణ, ఓట్ల అవకతవకలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం , ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ అనేది కేవలం తప్పు మాత్రమే కాదని, అది భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న మహా నేరమని మండిపడ్డారు. మన రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి ఇదేనంటూ ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను విడుదల చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Rahul Gandhi Vote Theft | సంచలన ఆరోపణలు..
వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ ఓట్ల దోపిడీ వెనుక భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), ఎన్నికల సంఘం (ఈసీ) ఉన్నాయని.. ఇవన్నీ ముమ్మాటికీ దేశద్రోహానికి ఒడిగట్టాయని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సాగుతున్న ఈ కుట్రలకు త్వరలోనే కాలం చెల్లుతుందని, దేశ ప్రజలకు తప్పకుండా న్యాయం చేకూరుతుందని స్పష్టం చేశారు.
Rahul Gandhi Vote Theft | రాహుల్ గాంధీ హెచ్చరిక..
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సంబంధిత అధికారులను ఉద్దేశించి ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాజ్యాంగబద్ధంగా నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులు.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం, ఓటర్ల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చివరి వరకు రాజీలేని పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల విశ్వసనీయతపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నల వేళ రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Vote chori is a crime against the Indian people and a direct attack on our constitution.
The BJP, RSS and EC who organised it have committed an act of treason.
Justice will be served. pic.twitter.com/30kX06CBiH
— Rahul Gandhi (@RahulGandhi) September 23, 2026
ఇది కూడా చదవండి: Hero Motors IPO | హీరో మోటార్స్.. లిస్టింగ్ తర్వాత అదుర్స్..