అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karnataka CM Meeting | కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం బుధవారం మరోసారి భేటీ అయింది. మంత్రులు వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari), జూపల్లి కృష్ణారావులు, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం అయ్యారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని మంగళవారం మంత్రుల బృందం కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయమై మరోసారి ఆయనతో చర్చించారు. పాలమూరు జిల్లాలో నీటి ఎద్దడి, పంటల ప్రస్తుత పరిస్థితులు వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.
మానవతా దృక్పథంతో పాలమూరు ప్రజలకు సాగు, తాగునీటిని విడుదల చేయాలని కోరారు. మంత్రులు విజ్ఞప్తికి డీకే శివకుమార్ అంగీకారం తెలిపినట్లు సమాచారం.నీటి విడుదలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Modi US Visit | డిసెంబర్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన