అక్షరటుడే, ఇందూరు : Ganapathi Shobhayatra Nizamabad | ఇందూరులో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అధికారులకు సూచించారు. బుధవారం నగరంలో శోభాయాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.
Ganapathi Shobhayatra Nizamabad | దుబ్బ చౌరస్తా నుంచి..
దుబ్బ చౌరస్తా నుంచి లలితా మహల్, గాంధీ గంజ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, పవన్ టాకీస్, గాజుల్ పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఇందూరులో నిర్వహించే గణపతి శోభాయాత్ర ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. సుమారు వందేళ్లుగా అనంత చతుర్దశి (ఈ నెల 25న) రోజున ప్రత్యేక రథంలో వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించామని, విద్యుత్, కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పోలీసు శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు.
Ganapathi Shobhayatra Nizamabad | విద్యుత్ దీపాల ఏర్పాటు..
ప్రధానంగా విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతల పూడ్చివేత, అవసరమైన చోట బీటీ రోడ్ల నిర్మాణం, వినాయకుల బావి వద్ద సౌకర్యాలు పరిశీలించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండప నిర్వాహకులు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, బీజేపీ కార్పొరేటర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, జ్యోతి మురళి, పంచరెడ్డి శ్యామ్, శ్రీనివాస్, మరావర్ కృష్ణ, వనిత పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Lorry Accident | లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలు