అక్షరటుడే, కామారెడ్డి: Ganesh Immersion Safety | శోభాయాత్ర సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సూచించారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
Ganesh Immersion Safety | పలు మండపాల సందర్శన..
కామారెడ్డి పట్టణంలోని కల్కి గణేష్ మండలి, ఏకదంత గణేష్ మండలి, శివసేన గణేష్ మండలి, పాన్ చౌరస్తాలోని బాల గణేష్ మండపాలను ఆయన సందర్శించి గణేష్ విగ్రహాలను దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో ఎస్పీ పాల్గొన్నారు. మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లు, నిమజ్జనానికి తరలించే విధానం, భక్తుల రద్దీ తదితర అంశాలను పరిశీలించి ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో భక్తులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. సందర్శన సందర్భంగా మండపాల వద్ద ఉన్న చిన్నారులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగి, ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటూనే భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Ganesh Immersion Safety | దేవునిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో..
అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రియాల్ చెరువు నిమజ్జన ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను రాజేష్ చంద్ర పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత, పార్కింగ్, గజ ఈతగాళ్ల అందుబాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్లకు సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి..: Ganapathi Shobhayatra Nizamabad | గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ధన్పాల్