Kakumanu Rajasekhar Death | వైఎస్సార్‌సీపీ కాకుమాను రాజశేఖర్ మృతి.. వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kakumanu Rajasekhar Death  | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ గురువారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ( YS Jagan Mohan Reddy )తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజశేఖర్ మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని జగన్ పేర్కొన్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారని, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించారని గుర్తుచేసుకున్నారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Kakumanu Rajasekhar Death  | ఘన నివాళులు..

కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణంపై పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రభాకర్, టీజేఆర్ సుధాకర్ బాబు, పుత్తా శివ శంకర్, మనోహర్ రెడ్డి, నారాయణమూర్తి, కొమ్మూరి కనకారావు, సురేంద్ర తదితర ముఖ్య నేతలు పాల్గొని జోహార్లు తెలిపారు. రాజశేఖర్ మృతితో పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: Hyderabad Metro Ganesh Immersion | గణేష్ నిమజ్జనం వేళ మెట్రో వేళలు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *