Oil Palm Farmers | కేంద్రం నిర్ణయంతో ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం : మంత్రి తుమ్మల

ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Oil Palm Farmers | ఆయిల్​ పామ్​ రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గించడంపై ఆయన మండిపడ్డారు.

ఓ వైపు దేశంలో ఆయిల్​ పామ్​ సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచిస్తున్న కేంద్రం, మరోవైపు దిగుమతి సుంకం తగ్గించడం సరికాదన్నారు. దీంతో దేశ రైతులకు సరైన ధర దక్కదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర తాజాగా తీసుకున్న నిర్ణయంతో ముడి పామ్​ ఆయిల్​పై దిగుమతి సుంకం 16.5 శాతం నుంచి 11 శాతానికి తగ్గిందని ఆయన తెలిపారు. దీంతో దిగుమతులు పెరిగి, దేశీయంగా ఆయిల్ పామ్ గెలల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

Oil Palm Farmers | ఏళ్లపాటు పెట్టుబడి

ఆయిల్ పామ్ ఒక సీజన్‌లో పండించి విక్రయించే పంట కాదని మంత్రి అన్నారు. సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టి, నిర్వహణ ఖర్చులు భరిస్తూ సాగు చేసే దీర్ఘకాలిక పంట అని పేర్కొన్నారు. ఇలాంటి పంటకు మార్కెట్ ధరపై విధానపరమైన స్థిరత్వం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.20 లక్షల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగు అవుతోందన్నారు. ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ.25 వేల కనీస హామీ ధర కల్పించాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Telangana Land Inquiry | రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణకు కమిటీ ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *