అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganesh Immersion | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Shobhayatra) అంగరంగ వైభవంగా సాగింది. బుధవారం రాత్రి 10 గంటలకు రైల్వే స్టేషన్ గణపతి శోభయాత్రను కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ ఛైర్పర్సన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
Kamareddy Ganesh Immersion | గురువారం రాత్రి వరకు..
గురువారం రాత్రి వరకు కూడా శోభాయాత్ర కొనసాగింది. పట్టణంలోని ధర్మశాల నుంచి ఇందిరాచౌక్, జీజీహెచ్, సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్డు, జయప్రకాష్ నారాయణ్ రోడ్డు, పెద్దబజార్ మీదుగా రైల్వే కమాన్, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా సాగిన శోభాయాత్ర టేక్రియాల్ చెరువులో గణేష్ నిమజ్జనంతో ముగిసింది. శోభాయాత్ర సందర్భంగా పట్టణమంత సందడిగా మారింది. డోలక్ శబ్దాలతో పట్టణం మారుమ్రోగింది. టేక్రియాల్ చెరువు వద్ద గణేషుల నిమజ్జనం కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్, రెవిన్యూ, విద్యుత్, పోలీసు యంత్రాంగం చెరువు వద్ద పగడ్బందీ చర్యలు చేపట్టారు. చెరువు వద్దకు మండపాల నిర్వాహకులను అనుమతించలేదు. క్రేన్ల సహాయంతో వినాయకులను చెరువులో నిమజ్జనం చేపట్టారు. చెరువు వద్ద నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి పరిశీలించారు. ప్రశాంతంగా నిమజ్జనం సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు చూశారా..!