అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Red Cross Election Panel | రెడ్‌క్రాస్ ఎన్నికల్లో (Nizamabad Red Cross) భాగంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్ దీకొండ యాదగిరి ఆధ్వర్యంలో ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న సభ్యులు పోటీలో నిలబడ్డారు.
Red Cross Election Panel | మరింత అభివృద్ధి చేసేందుకు..
ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ప్యానెల్లో దీకొండ యాదగిరితో పాటు ఫుడ్ బ్యాంక్ ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, వ్యాపారి కొండా సత్య ప్రసాద్, శివాజీ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్, బాలాజీ చౌహాన్, అనిల్ కుమార్, మింకి వేణుగోపాల్, వైద్యులు శ్రీను నాయక్, విద్యావేత్త రాజులదేవ్ రఘునాథ్ తదితరులు పోటీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: నాని సినిమాపై పబ్లిక్ టాక్..SMలో వైరల్ అయిన యువతి