Ganesh Immersion Nizamabad | గణపతుల బావి వద్ద భక్తుల సందడి.. భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యల నిమజ్జనం

నగరంలో గణేష్​ నిమజ్జనోత్సవ సందడి ప్రారంభమైంది.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Ganesh Immersion Nizamabad | నగరం (Nizamabad)లో గణేష్​ నిమజ్జనోత్సవ సందడి ప్రారంభమైంది. వినాయక్​నగర్​లోని గణపతుల బావి వద్దకు భక్తులు తరలివస్తున్నారు.

Ganesh Immersion Nizamabad | బొజ్జ గణపయ్యల నిమజ్జనం..

Ganesh Immersion Nizamabad

భారీ వినాయకుల విగ్రహాలను బాసరకు తరలించాలని.. చిన్న విఘ్నేశ్వర విగ్రహాలను నగరంలోని గణపతుల బావిలో నిమజ్జనం చేయవచ్చని పోలీసులు సూచించారు. ఈ సందర్భంగా ఇళ్లల్లో, చిన్న మండపాల్లో తొమ్మిదిరోజులు పూజలందుకున్న గణనాథులను భక్తులు నిమజ్జనం చేసేందుకు గణపతుల బావి వద్దకు తరలివస్తున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. బావి వద్ద బందోబస్తును ఏసీపీ ప్రకాశ్​ పర్యవేక్షించారు. అలాగే మహిళా పోలీస్​స్టేషన్​ సీఐ శ్రీలత, నాల్గో టౌన్​ ఎస్​హెచ్​వో సతీష్​ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Ganesh Shobhayatra | ఇందూరులో మరికొన్ని గంటల్లో గణేష్​ శోభాయాత్ర ప్రారంభం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *